telugu navyamedia
సినిమా వార్తలు

మీ సార్ పెద్ద గబ్బర్ సింగ్ అంట కదా.. నేనెవరో తెలుసా..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా బీమ్లానాయక్. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో నీత్యామీన‌న్‌, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్‌ ప్లే అందించారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం రేపు(ఫిబ్రవరి 25) విడుదల కానుంది.

హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ వైభ‌వంగా జ‌రిగింది. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ..మీ సార్ పెద్ద గబ్బర్ సింగ్ అంట .. నేనెవరో తెలుసా అన్నారు. ఈ సినిమాతో చాలా మంది మేధావుల్ని కలిశాను. నేను యాక్ట‌ర్ అయ్యి 12 ఏళ్ళు అయ్యింది కాని.. తెలుగు సినిమా హీరో ఎలా అవ్వాలో తెలీదు. నాక‌ళ్ళ ముందుకు హీరో వ‌చ్చాడు..

భీమ్లానాయక్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా కేటీఆర్, తలసాని శ్రీనివాసవ్​ యాదవ్​ వచ్చారు. ఈ ఫంక్షన్​లో పవన్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇండియాలో పెద్ద సూపర్ స్టార్స్ తో చేశాను. సార్ మీరు డిఫరెంట్..మీరు స్పెష‌ల్ ..ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే ఇకపై మరోలా ఉంటాయి. కల్యాణ్‌గారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను..

పంజా’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు పాస్‌ ఉన్నా కూడా లోపలికి వెళ్లి కల్యాణ్‌గారిని చూడలేకపోయాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు.

త్రివిక్రమ్ పొరపాటున సినిమాల్లోకి వచ్చారు.బ‌య‌ట ఉండిఉంటే..ఎలాన్ మస్క్ లాగా రాకెట్లు ఎగరేసేవారు.

ఈ సినిమాలో పవన్ కంటే ముందే నేను వున్నా. కంగ్రాట్యులేషన్స్ ఆల్. యంగ్ డైనమిక్ డైరెక్టర్ వంశీ. ఎంతోమంది పనిచేశాను. తెలంగాణ ప్రభుత్వం సినిమా ప్రోత్సాహానికి ధన్యవాదాలు. భారతీయ సినిమాకి హైదరాబాద్‌ రాజధానిగా మారడం ఖాయం” అన్నారు

Related posts