telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఆలయాల పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: మంత్రి వెల్లంపల్లి

srinivasa rao minister

కరోన వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయాల పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల ప్రవేశాన్ని ఆపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ విషయమై అధికారులు, ఆగమ శాస్త్ర పండితులు, పూజారులతో చర్చించినట్టు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు, భక్తులు సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా ఆయన కోరారు.

ప్రధాన దేవాలయాల్లో స్వామి వారికి, అమ్మ వార్లకు నిత్యం జరిగే నివేదనలు, సర్కారీ పూజలు యథావిధంగా జరుగుతాయని, అవకాశం మేరకు టీవీల ద్వారా ఆయా పూజాధికాలను ప్రసారం చేస్తామని చెప్పారు.ప్రజారోగ్యం మేరకు భక్తులు స్వచ్ఛందంగా ఆలయాలను దర్శించడం వాయిదా వేసుకోవాలని, రాష్ట్రంలోని చిన్న దేవాలయాలు బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే గ్రామ ఉత్సవాలు, జాతర్లను అనుమతించడం లేదని చెప్పారు. ఈ నిబంధనలు ఈనెల 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు.

Related posts