telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్

congress flags

కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రాజెక్ట్ వద్ద గోదావరి జల దీక్ష చేయడానికి వెళ్తున్న ఆ పార్టీ  నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్‌ని పోలీసులు చుట్టుముట్టారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, జగిత్యాల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు బండ శంకర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

మంథనిలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో శ్రీధర్‌బాబు నివాదం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. జల దీక్ష చేయడానికి వెళ్లే ప్రయత్నంలో శ్రీధర్‌బాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.

Related posts