telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేకేపై ఉపరాష్ట్రపతికి బీజేపీ నేతల ఫిర్యాదు!

bjp party

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కె.కేశవరావు (కేకే)కు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించారని ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇతర బీజేపీ నేతలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేకే వ్యవహారాన్ని రాజ్యసభ ఎథిక్స్ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కేకేపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మణ్ తో పాటు వెంకయ్యనాయుడిని కలిసిన వారిలో ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ తదితరులున్నారు.

Related posts