telugu navyamedia
సినిమా వార్తలు

సాహో : “లార్గోవించ్”కు కాపీ విమర్శలపై సుజీత్ రియాక్షన్

saaho movie team surprice on sradda birthday

ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్‌ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం 350కి పైగా కలెక్షన్లను సాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికి భారీ వ‌సూళ్ళు సాధించ‌డం చిత్ర బృందానికి సంతోషాన్నిచ్చింది. ఇక బాలీవుడ్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించి వంద కోట్ల‌కి పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే ఈ సినిమాను ఫ్రెంచ్ సినిమా “లార్గోవించ్” నుంచి కాపీ చేశారనే విమర్శ వినిపించింది. ఈ విమర్శపై తాజాగా దర్శకుడు సుజీత్ స్పందించాడు. “నిజం చెప్పాలంటే ఇలా కాపీ విమర్శలు చేస్తున్నవారెవరూ ‘లార్గోవించ్’ సినిమా చూసి ఉండరు. నేను కూడా ఆ సినిమా చూడలేదు. నా ‘రన్ రాజా రన్’ సినిమా స్క్రీన్ ప్లేనే కాస్త మార్చి ‘సాహో’ కథ తయారు చేశా. నాన్న చనిపోయిన కథలన్నీ ‘లార్గోవించ్’కు కాపీలేనా? ఆ సినిమా స్క్రీన్‌ ప్లే వేరు.. ‘సాహో’ సినిమా స్క్రీన్‌ ప్లే వేరు. సినిమా మీద కొందరు విమర్శలు చేస్తున్నా.. ప్రేక్షకులు మాత్రం పట్టించుకోవడం లేదు. `సాహో`కు వస్తున్న కలెక్షన్లే దానికి నిదర్శనం” అని సుజిత్ చెప్పాడు.

Related posts