telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆ సినిమా తీసే ఆలోచనలో ఏవ్వరూ లేరు అంటున్న హీరో…

R-Madhavan

ప్రస్తుతం సినీ రంగంలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ఆ దారిలోనే ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా జీవిత కథను తెరకెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత సుధ కొంగర ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. దాంతో ఇప్పుడు రతన్ టాటా జీవిత కథను కూడా ఆమె తెరకెక్కించనున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఈ బయోపిక్‌ గురించి పరిశ్రమలో గత మూడేళ్ళుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో స్టార్ హీరో మాధవన్ ప్రధాన పాత్రలో చేయనున్నాడని అంటున్నారు. అయితే ఇటీవల మాధవన్ ఈ సినిమాపై ఓ ట్వీట్ చేశాడు. రతన్ టాటా జీవిత కథను సినిమా తీసే ఆలోచనలో ఏవ్వరూ లేరంటూ బాంబ్ పెల్చాడు. అంతేకాకుండా కనీసం చర్చలో ఉన్న విషయం కూడా అవాస్తవం అని అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లాడు. అయితే ఈ విషయంలో మాధవన్ సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. అంతేకాకుండా నిర్మాత సుధ కొంగర కూడా ఈ విషయంపై ఆలోచించాలని అభిమానులు అన్నారు. అయితే ఈ సినిమా రూపొందితే జాతీయ స్థాయిలో హిట్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా వస్తుందా… లేదా అనేది.

Related posts