టాలీవుడ్ లో దాదాపు 1000కి పైగా పాటలు రాసిన శివగణేశ్ బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసినట్టు తెలిసింది. వనస్థలిపురంలోని ఆయన స్వగృహంలో అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిసింది. ఆయన తుది శ్వాస విడువడంతో సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువగా శివ గణేష్ తెలుగులో డబ్బింగ్ అయ్యే తమిళ సినిమాలకు పాటలు రాశారు.శివగణేశ్ తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ సినిమాలకు తనదైన శైలిలో పాటలను అందించిన శివగణేష్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రేమికుల రోజు, నర్సింహా, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, ఎంతవారు కాని, 7జీ బృందావన్ కాలనీ లాంటి మరచిపోలేని సినిమాలకు కూడా తన సాహిత్యమందించారు. శివగణేశ్ కు భార్య నాగేంద్రమణి, ఇద్దరు కుమారులు (సుహాస్, మానస్) ఉన్నారు.