telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : హీట్‌ పెంచేసిన 9వ వారం నామినేషన్ ప్రక్రియ

Bigg-Boss

బిగ్ బాస్ హౌస్‌లో 9వ వారం నామినేషన్ హీట్‌ మామూలుగా లేదు. ఇప్పటి నుంచి బిగ్ బాస్ ఇంటి సభ్యులు అసలైన ఆటను కనపరిచే సమయం ఆసన్నమైంది అంటూ గుడ్లు ఇచ్చి వాళ్ల తలపై పగలగొట్టి మరీ నామినేట్ చేయాలని కోరారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. సొహైల్‌ని అరియానా గుడ్డు పగలగొట్టి నామినేట్ చేయడంతో… ఇంకో గుడ్డు పగలగొడతావా?? నీ దగ్గర పర్సనల్ గుడ్డు ఉన్నదా? తెచ్చి కొట్టు అంటూ సీరియస్ అవుతున్నాడు సొహైల్. ఇక అఖిల్.. తన ప్రేయసి మోనాల్‌ని నామినేట్ చేస్తూ కనిపించాడు. దీంతో ఇంటి సభ్యులు అందరూ షాక్ అయ్యారు. ఇక అఖిల్-రాజశేఖర్, అభిజిత్-సొహైల్, మోనా్ల-సొహైల్, అవినాష్-అభిజిత్‌ల మధ్య నామినేషన్ రచ్చ మామూలుగా లేదు. ఐ యామ్ కమెడియన్ అండ్ ఎంటర్ టైనర్ అంటూ అవినాష్ అభి ముందు అరుస్తున్నాడు. ఇక హారికను అమ్మా రాజశేఖర్ నోర్ముయ్ అని అనడం, మీరు ఎవరి నోరూ మూయలేరిక్కడ అంటూ అభిజిత్ ఫైర్ అవడం, నిన్ను అందుకే నామినేట్ చేశా అని అభిజిత్ అరుస్తుంటే చేశావ్ లే పో.. అని మాస్టర్ అంతకు మించి అరుస్తున్నారు. ఇక చివర్లో అమ్మా రాజశేఖర్.. నేను నామినేట్ చేయను.. వాళ్లు కావాలని నన్ను బయటకు పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు’ అంటూ సీరియల్‌గా లేచి లోపలికి వెళ్లిపోతున్నాడు అమ్మా రాజశేఖర్. ఇక అందరూ ఈ గోలలో ఉంటే.. హారిక మాత్రం ‘నోయల్ నువ్ ఒక మాట అన్నావ్.. ఇక్కడ నుంచి వెళ్లిపోయిన వాళ్ల స్టాండ్ ఎవరూ తీసుకోరు అని.. నో నేను తీసుకుంటున్నా’ అని చెప్తోంది హారిక. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి.

Related posts