telugu navyamedia
సినిమా వార్తలు

త్రివిక్రమ్,, బన్నీ సినిమా అప్డేట్

allu arjun in festival celebrations
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా అప్డేట్ గురించి అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే సినిమా నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఓ ట్వీట్ చేశారు. ‘‘సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
అన్ని పనులు పూర్తవగానే మేము మీకు ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలన్నీ తెలియజేస్తాం. అప్పటి వరకూ ఓపికగా ఉండండి. ప్రతి ఒక్కరి ఫీలింగ్‌కి మేము ప్రాధాన్యమిస్తాం. మేము కూడా మీలాగే త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం’’ అంటూ ట్వీట్ చేశారు. ఇక అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఈరోజుతో 16 సంవత్సరాలు పూర్తి అవుతోంది. దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఏళ్లుగా అర్జున్ కు అభినందనలు తెలుపుతున్నారు.

Related posts