ఆమె ప్రేమ అపురూపం
ఆమె త్యాగం పరిపూర్ణం
ఆమె కరుణ సముద్రం
ఆమె కి తెలియనిది స్వార్ధం
ఆమె లేని ప్రాణకోటి లేదు
తను లేని ప్రపంచం లేదు
ఆమె లో కల్మషం లేదు
తనకున్న సహనం మరెవరికి లేదు
ఆమె పేరు అమృతం
ఆమె మనసు అధ్బుతం
ఆమె విలువ అమూల్యం
ఆమె జీవితం మనకి అంకితం
ఆమె మరెవరో కాదు అమ్మ
…………………………………..
చాలా దూరం ప్రయాణించి
ఖాళీ కడుపుతో ఇంటికి చేరుకోగానే
ప్రేమగా నువ్వు మాట్లాడే కొన్ని మాటలకే
నా మనసు పూర్తిగా నిండిపోతుంది అమ్మ
ఎంతలా అంటే ఆకలనే విషయాన్నే నేను మర్చిపోయేంతలా…
కాసేపు అలాగే
నన్ను నేను మైమరిచి
నీ నవ్వుల నదిలో పూర్తిగా మునిగిపోతూ తన్మయత్వాన్ని పొందుతుంటాను అమ్మా…
చంద్రబాబుపై కోపంతో జగన్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తారో: సోమిరెడ్డి