తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం బోని కపూర్ నిర్మాణంలో “పింక్” రీమేక్ గా తెరకెక్కుతున్న “నెర్కొండ పార్వాయి” అనే చిత్రంలో నటిస్తున్నాడు. హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటచలం, ఆండ్రియా తరియంగ్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు చిత్రబృందం. ఈ ట్రైలర్ లో లాయర్ పాత్రలో అజిత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా తమిళ నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. “నెర్కొండ పార్వాయి” చిత్రంలో అజిత్ భార్యగా విద్యా బాలన్ నటిస్తుంది. విద్యాబాలన్ కు తమిళంలో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి “కాలం…” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. గిబ్రాన్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. అధిక్ రవిచంద్రన్, అర్జున్ చిదంబరం, అశ్విన్ రావు, సుజిత్ శంకర్ ముఖ్య పాత్రలు పోషించారు.
“సాహో” కోసం ఎదురుచూస్తున్నాను… నారా లోకేష్