telugu navyamedia
రాజకీయ వార్తలు

జింబాంబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత!

mudabe robert

జింబాంబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(95) ఈరోజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముగాబే సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మనంగ్వా ప్రకటించారు. 1924, ఫిబ్రవరి 21న ముగాబే బ్రిటిష్ పాలనలోని రొడీషియాలో జన్మించారు.

దక్షిణాఫ్రికాలోని ఫోర్ట్ హార్ విశ్వవిద్యాలయం నుంచి స్కాలర్ షిప్ అందుకున్నారు. ఏడు డిగ్రీలు అందుకున్న అనంతరం ఘనాలో ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. అక్కడే ఘనా నేత కామే క్రుమా ఆలోచనలతో తీవ్రంగా ప్రభావితులయ్యారు. 1960లో స్వదేశానికి తిరిగొచ్చిన ముగాబే జింబాంబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జానూ) పార్టీని స్థాపించారు.1980లో ఎన్నికల్లో ముగాబే ప్రధానిగా ఎన్నికయ్యారు. 1987లో ప్రధాని పదవిని రద్దుచేసి అధ్యక్ష పదవి బాధ్యతలు ముగాబే చేపట్టారు.

Related posts