బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “వార్” సినిమా గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాణీ కపూర్ కథానాయికగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన `కబీర్ సింగ్` పేరిట ఉండేది. తాజాగా “కబీర్ సింగ్” వసూళ్లను “వార్” అధిగమించింది. “కబీర్ సింగ్” సినిమా మొత్తం కలెక్షన్లను “వార్” 14వ రోజునే క్రాస్ చేయగలిగింది. అయితే బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళం మొత్తం కలిపితేనే “వార్”కు ఈ వసూళ్లు దక్కాయి. ఏదేమైనా ఇప్పటికి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా “వార్” నిలిచింది. అయితే త్వరలో విడుదల కానున్న అక్షయ్ కుమార్ `హౌస్‌పుల్-4`, సల్మాన్ ఖాన్ `దబాంగ్-3` వంటి చిత్రాలు `వార్` రికార్డుకు ఎసరు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఆ ముగ్గురు హీరోయిన్లే డిమాండ్ చేస్తారు… హీరోయిన్లపై ప్రియమణి కామెంట్స్