telugu navyamedia
సినిమా వార్తలు

“గ్యాంగ్‌లీడ‌ర్‌” డైరెక్ట‌ర్ సెట్స్‌లో ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారో చూడండి

Nani

నాని ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం చేస్తున్నాడు. నాని 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియాంక అరుల్‌మోహ‌న్, ల‌క్ష్మీ , శ‌ర‌ణ్య‌, అనీష్ కురువిళ్ళా, ప్రియ‌ద‌ర్శి, ర‌ఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, స‌త్య త‌దిద‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. 8 ఏళ్ల చిన్న‌ పాప‌.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల క‌త్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల అమ్మ వ‌య‌సు ఉన్న మ‌హిళ.. కాటికి కాలు చాపుకున్న బామ్మ‌.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడ‌ర్.. అత‌డే మ‌న గ్యాంగ్ లీడ‌ర్. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌. బామ్మ‌, స్వాతి, ప్రియ‌, వ‌ర‌ల‌క్ష్మి, చిన్ను మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. మైత్రి మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఆగస్ట్ 30 అనుకున్నా కూడా ఆ రోజు సాహో రానుండటంతో ఇప్పుడు నాని కొత్త డేట్ కోసం వేట మొదలు పెట్టారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. తాజాగా షూటింగ్ సమ‌యంలో త‌న డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుందో ఓ వీడియో ద్వారా నాని వివ‌రించాడు. షూటింగ్ స్పాట్‌లో ఓ పాప‌తో విక్ర‌మ్ స‌ర‌దాగా ఆడుకుంటున్న వీడియోను నాని త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. `గ్యాంగ్‌లీడ‌ర్‌` డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ సెట్స్‌లో ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారో చూడండి అంటూ నాని స‌ర‌దాగా ట్వీట్ చేశాడు.

Related posts