telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బ్యాలెట్ బాక్సులు మారిపోయే అవకాశం ఉంది…

ఏపీలో నిన్న మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి.  ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చాలా తక్కువ పోలింగ్ నమోదైనట్టుగా టీడీపీ నేతలు చెప్తున్నారు.  కాగా, పోలింగ్ ముగిసిన అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.  వైసీపీ చాలా చోట్ల ఏకగ్రీవం చేసుకుందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని అన్నారు.  సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఓటు మాయమైందని, ఎన్నికలు పూర్తయినా ఏలూరులో ఫలితాలు ప్రకటించవద్దని చెప్తున్నారని అన్నారు.  బ్యాలెట్ బాక్సులు మారిపోయే అవకాశం ఉందని, పోలీసులపై నమ్మకం లేదని, స్ట్రాంగ్ రూమ్ లలో బాక్సులు భద్రపరిచే సమయంలో ఆభ్యర్ధి పార్టీ ప్రతినిధుల సమక్షంలో భద్రపరచాలని ఎమ్మెల్సీ అశోక్ పేర్కొన్నారు.  ఐదు గంటల తరువాత తలుపులు వేసి ఎన్నికల సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.  ప్రజల్లో మార్పు కనిపిస్తోందని, అయితే, వైసీపీ నేతలు దారుణానికి పాల్పడ్డారని అన్నారు.  వైసీపీ శ్రేణులు ఒక్కో కుటుంబానికి రూ.10వేలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేశారని ఎమ్మెల్సీ అశోక్ ఆరోపించారు.  చూడాలి మరి ఈ దీని పై ఎన్నికల కమిషన్ అలాగే వైసీపీ ఎలా స్పందిస్తుంది అనేది.

Related posts