telugu navyamedia
క్రీడలు వార్తలు

డేనైట్ టెస్టు చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు

birthday wishes to virat kohli

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న డేనైట్ టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మెరుపు శతకంతో చెలరేగాడు. ఈ శతకంతో భారత డేనైట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా కోహ్లీ రికార్డును తన పేరన రాసుకున్నాడు. డే టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన ఘనత లాలా అమర్ నాథ్ పేరన ఉంది. కోహ్లీ 159 బంతులు ఆడి, 12 బౌండరీలతో తన సెంచరీ పూర్తి చేశాడు.

టెస్టుల్లో ఇప్పటివరకు కోహ్లీకి 27 సెంచరీలు చేశాడు. కాగా, భారత జట్టు లంచ్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కోహ్లీ 130 పరుగులు, రవీంద్ర జడేజా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు భారత జట్టులో చటేశ్వర్ పుజారా 55 పరుగులు, అజింక్య రహానే 51 పరుగులు చేసి జట్టు స్కోరుకు తోడ్పడ్డారు. భారత్ జట్టు ఇప్పటివరకు బంగ్లాపై 183 పరుగుల ఆధిత్యకతను సాధించింది.

Related posts