తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ చనిపోయి మరో రెండు రోజుల్లో ఆరు నెలలు పూర్తి కానుంది. అయితే.. ఇప్పటి వరకు బైపోల్ షెడ్యూల్‌పై ఎలాంటి స్పష్టత రాలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలోనూ తిరుపతి ఉప ఎన్నికపై క్లారిటీ రాలేదు. కానీ పొత్తులు.. అభ్యర్థులపై క్లారిటీకి వచ్చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఇక తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థినే పోటీ దింపనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థినే తిరుపతిలో నిలపడంపై జనసేన సైతం అంగీకారం తెలిపినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో సోమువీర్రాజు, సునీల్ డియోదర్‌తో పవన్ సమావేశం అయ్యారు. తర్వలోనే బీజేపీ అభ్యర్థిని ప్రకటించనుంది అధిష్టానం. కాగా… తిరుపతి విషయంలో బీజేపీ-జనసేన క్లారిటీకి రావడంతో ఒకట్రోండు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుందా..? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొత్త రాజధానుల జపం చేయడం మంచిదికాదు: వీహెచ్