telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైద్య సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి: పవన్ కల్యాణ్

కరోనా బాధితులకు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్అన్నారు. ఈ మేరకు ఆయన ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైద్య సిబ్బంది వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసి కూడా సేవలు అందిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని ఎవరూ విస్మరించకూడదు. ఇంట్లో తమ బిడ్డలను వదిలొచ్చి వారు విధులను నిర్వర్తిస్తున్నారు. తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు ఆ చిన్నారులకు, ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వారికి ప్రమాదం అని తెలిసి కూడా వారు సేవలందిస్తున్నారు. అలాంటి వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంచకపోవడం దారుణమని పేర్కొన్నారు.

కరోనాకు వైద్యం, పరీక్షలు చేసే సిబ్బంది ఎలాంటి గౌన్స్, గ్లోవ్స్, మాస్కులు, ఫేస్ షీల్డ్ ధరించాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. దానికి తగ్గట్టుగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ ఇవ్వాలి. ఆసుపత్రుల్లో వాటిని సమకూర్చకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎన్-95 మాస్కులు కూడా ఇవ్వడం లేదని, సాధారణ డిస్పోజబుల్ గౌన్స్ మాత్రమే ఇస్తున్నారనే వైద్యుల మాటను ఒకసారి వినండని లేఖలో తెలిపారు.

Related posts