దాయాది దేశమైన పాకిస్తాన్ మరోసారి కయ్యనికి కాలుదువ్వింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాల్లో ఉన్న ఫార్వర్డ్ పోస్టులపై పాకిస్థాన్ ఆర్మీ మోర్టార్ షెల్స్‌తో దాడి చేసింది. ఇవాళ ఉదయం కాల్పులు జరిపినట్లు కూడా ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే భారత ఆర్మీ కూడా ఆ దాడుల్ని తిప్పికొట్టింది. భారీగా ఎదురుకాల్పులకు దిగింది. షాపూర్, కిర్ని సెక్టార్ల వద్ద పాక్ రేంజర్లు కాల్పులకు తెగించారు. ఉదయం 7 గంటల నుంచి అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. పూంచ్‌లో పాక్ జరిపిన కాల్పుల వల్ల ఆరుగురు గాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పాక్ ఆర్మీ సుమారు రెండు వేల సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది.
previous post
next post