telugu navyamedia
రాజకీయ వార్తలు

క్రికెట్, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు: గడ్కరీ

nitish gadkari to hyderabad today

మ‌హారాష్ట్ర సీఎంగా ఫ‌డ్న‌వీస్ రెండవసారి ఈ రోజు ఉదయం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ‘క్రికెట్, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని నేను ముందే చెప్పాను. నా మాటలకు అర్థం ఏంటో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు’ అని ఛలోక్తులు వదిలారు.

కాగా, ఈ రోజు సాయంత్రం ఎన్సీపీ అధిష్ఠానం తమ ఎమ్మెల్యేలతో భేటీ అవుతోంది. అనేక ఆసక్తికర మలుపులతో ముందుకు వెళుతోన్న మహారాష్ట్ర రాజకీయాల్లో మున్ముందు ఇంకా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొన్నట్టు స్పష్టమవుతోంది.

Related posts