విజయనగరంలో బొత్స కుటుంబ పాలన సాగుతోందని దానిని పారద్రోలాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.శుక్రవారం ఆయన విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుకే ఎంపీ అభ్యర్థిగా ఉన్న బొత్స సత్యనారాయణను ఎదుర్కోవడానికి బుక్కా శ్రీనివాసరావును జనసేన తరపున నిలబెట్టినట్లు వివరించారు.
బొత్స గురించి చాలా కథలు వింటుంటామని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో బొత్స, ఆయన భార్య, తమ్ముడు, మేనల్లుడి చేతిలోనే పాలన ఉండాలా అని ప్రశ్నించారు. కొత్త రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ నాయకత్వం నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. తాను ప్రజాస్వామ్య వ్యవస్థకు అండగా ఉండేవాడినని తెలిపారు. ఉద్యోగాలు రావాలంటే మూడు జూట్ మిల్లులను తెరవాలన్నారు. సంస్థానం గౌరవం నిలబెట్టే బాధ్యత తనదేనని వెల్లడించారు. వలసలు ఆగిపోయి విజయనగరాన్ని అద్భుత నగరంగా మార్చుతానని హామీ ఇచ్చారు.
వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు…