telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాళ్ళతో రజినీకాంత్ స్కెచ్… అభినందించిన సూపర్ స్టార్

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ కు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ని స్వ‌యంగా క‌లిసి ఆయ‌న‌కి త‌ను వేసిన స్కెచ్‌ని బ‌హుమ‌తిగా ఇచ్చాడు ఓ అభిమాని. అయితే అది చేతులతో కాదు… కాళ్ళతో వేసిన స్కెచ్… ఇది చూసిన ర‌జ‌నీకాంత్ చాలా సంతోషించి ప్ర‌ణవ్‌తో కాసేపు స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డిపారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌, ప్ర‌ణ‌వ్ క‌లిసి దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అత‌నెవ‌రో కాదు కేర‌ళ‌కి చెందిన ప్ర‌ణ‌వ్‌. ఇప్ప‌టికే స‌చిన్ టెండూల్క‌ర్‌, కేర‌ళ సీఎంతో పాటు ప‌లువురు స్కెచ్‌ల‌ని అద్భుతంగా వేసి శ‌భాష్ అనిపించుకున్నాడు. ఇక రజినీకాంత్ తాజాగా నటించిన “దర్బార్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాదు రజినీకాంత్ తన 168వ సినిమాను కూడా మొదలుపెట్టేశారు. కాగా రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

Related posts