telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నోరూరించే చికెన్ పచ్చడి తయారు చేసిన రోజా

ఒకవైపు రాజకీయాలు, మరోవైపు టీవీ షోస్‌తో ఎప్పుడూ బిజీ ఉండే ఎమ్మెల్యే రోజాకి కరోనా పుణ్యమా అని ఖాళీ టైమ్ దొరింది. ఇలా రోజుకో కొత్త వంటకం చేస్తూసోషల్ మీడియాలో పెడుతున్నారు రోజా. అంతేకాదు తయారీ విధానం కూడా చెబుతున్నారు. మొన్న చికెన్ ఫ్రై, ఆ తర్వాత గుత్తి వంకాయ ఫ్రై, బీట్‌రూట్ ఛట్నీ చేశారు. అలాగే మామిడి కాయలను తెగ నరికేసి నోరూరించే ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూపించారు. ఇక రోజు మళ్లీ మన ముందుకు ఓ నోరూరించే వంటకంతో వచ్చేశారు. అదే నాన్‌ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ‘చికెన్ పచ్చడి’. మళ్లీ ఇలాంటి టైమ్ జీవితంలో వస్తుందో రాదో తెలియదు. అందుకే పూర్తిగా ఇంట్లోనే ఉంటూ తన పిల్లలకి నోరూరించే వంటలను వండి పెడుతున్నారు. కేవలం రోజానే కాకుండా టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా పూర్తిగా వంటలు, ఇంటి పనులతోనే బిజీ అయిపోయారు. ఎప్పటికప్పుడు వాళ్లు చేసినవన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

Related posts