telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నేడు మౌలాలీలో .. వేణుమాధవ్ అంత్యక్రియలు..

venu madhav cremation in moulali today

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమెడియన్ వేణుమాధవ్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం వేణుమాధవ్ భౌతికాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో అందుబాటులో ఉంచారు. అనంతరం మౌలాలీలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పేదవారికి ఆయన ఎంతో సహాయం చేసేవాడని, అటువంటి వ్యక్తి తమ మధ్య లేకపోవడం దురదృష్టకరమని పలువులు అన్నారు.

వేణుమాధవ్ ఇప్పటివరకు 600 సినిమాల్లో నటించారు. తొలిప్రేమ, దిల్, లక్ష్మి, సై, ఛత్రపతి చిత్రాలు మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాన్ని కూడా వేణుమాధవ్ అందుకున్నారు.

Related posts