telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పర్యాటక దినోత్సవం సందర్భంగా .. ఉచిత ప్రవేశం…ప్రత్యేక కార్యక్రమాలు..

free entry into visaka tourist places on

ఈ నెల 26, 27 తేదీల్లో విశాఖపట్నంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. కైలాసగిరి, తొట్లకొండ, వుడా పార్కు, వైఎ్‌సఆర్‌ సెంట్రల్‌ పార్కు, కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం, టీయూ-142 ఇలా అన్నింటిని ఉచితంగా సందర్శించవచ్చు. రుషికొండలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన పారా గ్లైడింగ్‌ను, కంబాలకొండలో అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌, ట్రెక్కింగ్‌లకు రాయితీ ఇవ్వనున్నట్టు పర్యాటక శాఖ జిల్లా అధికారిణి పూర్ణిమా దేవి తెలిపారు. పర్యాటకులు, విశాఖ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 27 ప్రపంచ పర్యాటక దినం.

ఆ సందర్భంగా అదే రోజు(శుక్రవారం) ఉదయం 6.30 గంటలకు ఆర్‌కే బీచ్‌లో టూరిజం వాక్‌ నిర్వహిస్తున్నారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ వాక్‌ ఉంటుంది. ఆసక్తి కలిగినవారు పాల్గొనవచ్చు. అదే రోజు సాయంత్రం 5.00 గంటలకు ఆర్‌కే బీచ్‌లో నోవాటెల్‌ ఎదురుగా ఉన్న వేదిక వద్ద పర్యాటక ఉత్సవాలు నిర్వహించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విజేలకు బహుమతులు అందిస్తారు. ఇదే వేదిక వద్ద చేతి వృత్తుల ప్రదర్శన, వివిధ వంటకాలతో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తారు. ఇవి ఉదయం 10.30 గంటల నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా పిల్లలకు అన్ని పాఠశాలల్లోను వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారు. అప్పుఘర్‌ దగ్గరున్న పర్యాటక శాఖ యాత్రీనివా్‌సలో గరువారం ఉదయం 10.30 గంటలకు పెయింటింగ్‌ పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తికలిగిన వారు పాల్గొనవచ్చు.

Related posts