కరోనా బారిన పడి బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు పి.అచ్చుతరావు కాసేపటి క్రితం మలక్ పేట యశోద ఆసుపత్రిలో మరణించారు. వారు బాలల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తు, ఎంతో మంది బాల కార్మికుల ను పాఠశాలలో చేర్చి విద్యార్థులగా మరిచిన ఘనత అచ్చుతరావుకే సొంతం. పేద పిల్లల కోసం ఎంతో కష్టపడే తత్వం ఉన్న గొప్ప వ్యక్తి. అచ్చుతరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ట్రస్మ రాష్ట్ర అద్యక్షులు యాదగిరి శేఖర్ రావు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మనలో లేకున్నా వారు చేసిన సేవలు మాత్రం ప్రజల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని చెప్పుకొచ్చారు.