telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రుణమాఫీ భారం మోయలేము … ఏపీ ప్రభుత్వం..

AP

గత ప్రభుత్వం ఇచ్చిన రైతులకు రుణమాఫీ హామీని తాము నెరవేర్చలేమని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఇది సన్నకారు రైతులకు షాకింగ్ న్యూస్ అని చెప్పక తప్పదు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంనాలుగు, ఐదు విడతల మాఫీ కిస్తీలకు రూ.7,959.12 కోట్ల చెల్లింపుల కోసం మార్చి 10న ఇచ్చిన జీవో నెం.38ని ఇచ్చింది. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 38 ని రద్దు చేస్తూ జీవో నెం.99ని జారీ చేసింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రైతుల రుణాలన్నింటినీ రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత పలు వడపోతలతో రూ.24,500 కోట్లను ఐదేళ్లల్లో ఐదు విడతల్లో మాఫీ చేస్తామని, రైతులకు పది శాతం వడ్డీతో సొమ్ము చెల్లిస్తామని చెప్పి మాట మార్చింది. ఒకేసారి రుణమాఫీ చేయాల్సిన చోట ఐదు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించింది.

2019 ఎన్నికల ముందు వరకు మూడు దఫాలుగా రుణమాఫీ చేసిన టిడిపి ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు నాలుగో విడత రుణమాఫీ సొమ్ముపై మార్చి 10న ఉత్తర్వులిచ్చింది. ఆ డబ్బు చెల్లించడానికి సరిపడా నిధులు లేకపోవడంతో చెల్లించలేకపోయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రుణమాఫీ జరగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి సర్కార్ , నాలుగు, ఐదు విడతల మాఫీ సొమ్ము రూ.7,959.12 కోట్లు రుణ మాఫీ కింద చెల్లించాల్సిన గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేది లేదని తేల్చి చెప్పింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అందుబాటులోకి తీసుకు రానున్న నేపథ్యంలోనే రుణమాఫీ బకాయిలను చెల్లించాలని గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులను రద్దు చేసినట్లుగా చెబుతోంది.

Related posts