జక్కన దర్శకత్వంలో మరో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కొమరం భీంగా తారక్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్న ఈ సినిమా 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే 3 షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా నాల్గవ షెడ్యూల్ షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అబ్రివేషన్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ అన్ని భాషలకు సెపరేట్ టైటిల్ ఉంటుందని రాజమౌళి అప్పుడే చెప్పాడు. చెప్పినట్టుగానే తెలుగులో ఆర్.ఆర్.ఆర్ కు రామ రౌద్ర రుషితం అని ఫిక్స్ చేశారట.
ఇతరభాషలలో ఈ చిత్రం టైటిల్ రైజ్ రివోల్ట్ రివెంజ్ అని పెట్టబోతున్నారట. టైటిల్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మరో బాహుబలి కాదు కాదు అంతకుమించే సినిమా చేస్తాడని అనుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సినిమాపై తెలుగు సినిమా ఆధిపత్యం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటేలా చూస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఒకరిని మించి ఒకరు తమ నట విశ్వరూపం చూపించేలా ఉన్నారు. సినిమాకు కీరవాణి మ్యూజిక్ కూడా బలం కానుంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొదలుపెడుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ మరోసారి తెలుగు సినిమా స్టామినా చాటిచెప్పే సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాపై ఎలాంటి క్లూస్ బయటకు రాకుండా అంచనాలు పెంచుతున్నారు రాజమౌళి. అక్టోబర్ 22న కొమరం భీం జయంతి సంద్ర్భంగా తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.