telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

కేసీఆర్ బర్త్ డే : ‘కోటి వృక్షార్చన‌’కు నాగార్జున‌ సపోర్ట్

Nagarjuna

మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17 న ఒక రోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేద్దాం అని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మన దేశానికి, ప్రపంచానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఈ మధ్యనే మనం చూశాం ఉత్తరాఖండ్ లో జరిగిన వరదల వల్ల చాలామంది ప్రజలు చనిపోవడం జరిగిందని. కాబట్టి బాధ్యత గల పౌరులుగా వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మనం కూడా ఏదైనా ఒకటి చేయాలని అనే ఉద్దేశంతో అది కూడా ఒక ప్రత్యేకమైన రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఒకరోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటే మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని… ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఆకుపచ్చ తెలంగాణ గా చేయడం జరిగిందని. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా అందరం పాల్గొని విజయవంతం చేయాలని అదే ముఖ్యమంత్రి గారికి మన తరపున హరిత కానుక అని తెలిపారు.
ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.

Related posts