telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా పుట్టుకపై డబ్యూహెచ్‌ఓ అధ్యయనంలో సంచలన విషయాలు..

చైనా నుండి వచ్చిన కరోనా మనదేశాన్ని దాదాపుగా ఏడాది నుండి అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుండి కరోనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పటికే మన దేశంలో చాలా మంది రాజకీయనాయకులకు, సెలబ్రెటీలకు కరోనా సోకింది.  అయితే.. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ… ఈ కరోనా మహమ్మారి అందరికీ చుక్కలు చూపిస్తోంది. అయితే.. తాజాగా కరోనా పుట్టుకకు సంబంధించిన రహస్యాలను తేల్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా సంయుక్తంగా ఓ అధ్యయనం చేపట్టాయి. దీని తాలూకు ముసాయిదా నివేదిక తాజాగా వెల్లడైంది. గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా కరోనా మనుషులకు సంక్రమించి ఉండొచ్చని ఈ అధ్యయనంలో తేలిందట. అంతేకాకుండా.. కరోనా వైరస్ ల్యాబ్‌లో పుట్టిందని చెప్పేందుకు అవకాశాలు చాలా తక్కువని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనం తాలూకు ఫలితాల వెల్లడిలో ఇప్పటికే ఆలస్యం జరిగిందనే వినిపిస్తోంది. ఫలితాలను తనకు అనూకూలంగా మార్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్న కారణంగానే ఈ జాప్యం జరిగిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్న విషయం తేలిసిందే. కాగా.. తాజా కేసులతోమన దేశంలో 1.20 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 56,211 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 271 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 37,028 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,95,855 కాగా .. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 5,40,720 గా ఉన్నాయి.

Related posts