telugu navyamedia
సినిమా వార్తలు

తాతలు, తండ్రులు ఉంటే చాలదు, వాళ్ల లా టాలెంట్‌ కూడా ఉండాలి..

టాలీవుడ్ రౌడీ విజయ్‌ దేవరకొండ హీరోగా, డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం లైగర్‌. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా న‌టించారు.

ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా ఫ్యాన్స్‌ పండగ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హీరో విజయ్ దేవరకొండ భారీ కటౌట్‌ పెట్టి దానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి భారీ స్థాయిలో హడావిడి చేశారు. అటు సోషల్‌ మీడియానూ ‘లైగర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో సందడి చేశారు. హైదరాబాద్ సుదర్శన్ 35 ఎం ఎం లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా అభిమానులను ఉద్దేశించి విజయ్‌ మెంటల్‌ మాస్‌ స్పీచ్‌ ఇచ్చాడు.

విజయ్ దేవరకొండ డైలాగ్స్‌పై బండ్ల గణేష్ కౌంటర్.. ఉంటే సరిపోదు అంటూ

మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్‌ అయ్యి రెండేళ్లు అయితుంది. రిలీజ్‌ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే మూవీ కాదు. అయినా ట్రైలర్‌కు ఈ రచ్చ ఏందిరా నాయన..’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

అయితే విజయ్‌ టాలీవుడ్‌లో మెగా హీరోలను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా బండ్ల గణేశ్‌ దీనికి కౌంటర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్‌ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేశ్‌బాబులా, రామ్‌చరణ్‌లా, ప్రభాస్‌లా.. గుర్తుపెట్టుకో బ్రదర్‌’ అని ట్వీట్‌ చేశాడు.

అయితే కొందరు ఇది రౌడీ హీరోకు కౌంటర్‌ ఇచ్చినట్లు ఉందని అంటుంటే మరికొందరు మాత్రం ప్రభాస్‌, రామ్‌చరణ్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌లను విమర్శించినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts