telugu navyamedia
సినిమా వార్తలు

చిన్నారుల కోసం సరికొత్తగా “సైరా నరసింహారెడ్డి”

Syeraa

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అమిత్‌ త్రివేది స్వరకర్త. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిరంజీవి తన 41 ఏళ్ళ కెరీర్‌లో ఒక హిస్టారికల్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు చిరంజీవి నటించిన ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కావడం అనేది కూడా ఫస్ట్ టైమే అని చెప్పొచ్చు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘U/A’ సర్టిఫికేట్ ను పొందింది. ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానున్న విషయం తెలిసిందే. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న.. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అంతేస్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్.. ఈ స్వాతంత్ర సమరయోధుడి చరిత్రను చిన్నారులకు తెలియజేసేందుకు ప్రఖ్యాత కామిక్ పుస్తకాల సంస్థ ‘అమర్ చిత్ర కథ’ కంపెనీతో కలిసి పనిచేస్తోంది. ఈ పుస్తకానికి సంబంధించి ముఖచిత్రాన్ని సోమవారం విడుదల చేశారు. ‘నరసింహా రెడ్డి.. ది లయన్ ఆఫ్ రాయలసీమ’ పేరుతో రానున్న ఈ పుస్తక ముఖచిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా.. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ హక్కుల అమ్మకంలో పెద్ద ఎత్తున మార్కెట్ జరిగింది.

Related posts