telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” ప్రీమియర్ షో కలెక్షన్స్ … ఆరవ స్థానం…!

Saaho

ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్‌ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా “సాహో” బాగానే కలెక్షన్స్‌ను రాబడుతోంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మొదటి రోజున రూ.25 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్‌ విషయానికి వస్తే… యూఎస్‌లో సాహో చిత్రం రికార్డు వసూళ్లను రాబట్టింది. ప్రీమియర్స్‌లో “బాహుబలి-2” చిత్రం 2.4 మిలియన్‌ డాలర్లు వసూలు చేయగా, “అజ్ఞాతవాసి” చిత్రం 1.52 మిలియన్‌ డాలర్లు, “బాహుబలి” చిత్రం 1.39 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇక చిరంజీవి “ఖైదీ నంబర్‌ 150” చిత్రం 1.29 మిలియన్‌ డాలర్లు వసూలు చేయగా… మహేష్ “స్పైడర్‌” చిత్రం 1.00 మిలియన్‌ డాలర్లు రాబట్టింది. నిన్న విడుదలైన ప్రభాస్ “సాహో” 915 మిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో నిలిచింది. దీని తర్వాత “భరత్‌ అనే నేను” చిత్రం 850 వేల డాలర్లు, “అరవింద సమేత” చిత్రం 789 వేల డాలర్లు, “రంగస్థలం” చిత్రం 725 వేల డాలర్లు, పవన్ కళ్యాణ్ “సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌” 616 వేల డాలర్లు రాబట్టి తర్వాతి ఐదు స్థానాల్లో నిలిచాయి.

Related posts