telugu navyamedia
సినిమా వార్తలు

నేడు నట సార్వభౌముడు ఎన్టీఆర్ 26 వ వర్ధంతి..

నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. తెలుగు చిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. రంగం ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా ఆయన దిగనంత వరకే.. చరిత్ర సృష్టించాలన్నా.. ఆ చరిత్రను తిరగరాయాలన్నా కేవలం ఎన్టీఆర్ వలనే అవుతుంది.

NT Rama Rao's 24th death anniversary: How Tollywood celebs and fans remembered the late legendary actor-politician | Telugu Movie News - Times of India

ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తావన తెస్తే మొదట వినిపించేది నందమూరి తారక రామారావు పేరే . తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు… యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘిక, పౌరాణిక ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నట్టు ఉంటుంది. సినీ చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. అలాంటి నటుడు ఇంత వరకూ రాలేదు.. ఇకపై కూడా అలాంటి నటుడిని చూడటం అనేది జరగదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

NT Rama Rao death anniversary: All about the former Andhra Pradesh CM and movie star

వెండి తెరమీంచి ప్రజల గుండెల్లోకి, అక్కడి నుంచి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి సిసలైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. తెరమీది కథానాయకుడు ..ప్రజాజీవితంలో మహానాయకుడయ్యాడు. అప్పటికీ ఇప్పటికీ రాజకీయరంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు.

Senior Ntr Date Of Birth : To do this, you need enter their dates of birth (your and your's parner) and click on the «calculate compatibility!» button. - Netwaress

తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.

NT Rama Rao death anniversary: Lesser known facts about NTR

రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా కళామ్మ తల్లికి, ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఎన్టీఆర్ 1996, జనవరి 18 న కన్నుమూశారు.

NT Rama Rao Death Anniversary: 5 Must-watch Films of the Legendary Actor

కాగా నేడు ఎన్టీఆర్ 26 వ వర్ధంతి కావడంతో నందమూరి అభిమానులు సహా ఆయన కుటుంబీకులు మరోసారి ఆయన పేరు గుర్తు చేసుకుంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళుల్పించారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు.

Related posts