telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మళ్ళీ ట్రాక్ పైకి విజయ్ దేవరకొండ “హీరో”… సినిమా ఆగిపోలేదట…!

Vijay-Devarakonda

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం “హీరో” చిత్రం ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆనంద్ అన్నామ‌లై ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో “హీరో” సినిమా తెర‌కెక్క‌నుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి ఇలాంటి డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీలో న‌టిస్తున్నారు. “పేట్ట” ఫేమ్ మాళ‌వికా మోహ‌న‌న్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమ‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ప్ర‌దీప్‌కుమార్ సంగీతం అందించ‌బోయే ఈ చిత్రానికి ముర‌ళి గోవింద రాజులు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఆగిపోయినట్టుగా గతంలో ప్రచారం జరిగింది. అయితే తాజా సమచారం ప్రకారం ఈ సినిమాను తిరిగి సెట్స్‌ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్‌. ఈ సినిమాలో విజయ్‌, బైక్‌ రేసర్‌గా నటిస్తున్నాడు. చాలా రోజుల కిందటే షూటింగ్ ప్రారంభించిన ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. ఢిల్లీలో షూట్‌ చేసిన ఈ షెడ్యూల్‌లో విజయ్‌పై రేసింగ్‌ సీన్స్‌ను చిత్రీకరించారు. అయితే నిర్మాతలు అవుట్‌పుట్‌తో సంతృప్తికరంగా లేకపోవటంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రచారం జరిగింది. దాదాపు 12 కోట్లతో తొలి షెడ్యూల్‌ చేసినా తరువాత ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారని అంతా భావించారు. కానీ తాజాగా ఈ సినిమాను తిరిగి ప్రారంభిస్తున్నారట. ఈ సినిమా చాలా కాలం క్రితమే ప్రారంభమైన మధ్యలో అనేక కారణాలతో షూటింగ్ నిలిచిపోయింది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమాను డియర్‌ కామ్రేడ్‌ రిలీజ్ తరువాత పక్కన పెట్టేశారు. డియర్‌ కామ్రేడ్‌ డిజాస్టర్‌ కావటంతో, హీరో అవుట్‌ పుట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో అంత బడ్జెట్‌ రిస్క్‌ అన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసినట్టుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్‌ లవర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరకుంది. దీంతో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ పూర్తయిన వెంటనే హీరో సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు రౌడీ. ఈ సినిమాతో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పాడు విజయ్‌ దేవరకొండ. పూరి, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫైటర్‌ అనే టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. హీరోతో పాటు ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు విజయ్‌ దేవరకొండ.

Related posts