telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోహన్ బాబు “సన్ ఆఫ్ ఇండియా”

Son-of-INdia

సీనియర్ నటుడు మోహన్ బాబు తాజాగా తాను నటిస్తున్న సినిమాను అనౌన్స్ చేసారు. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని “సన్ ఆఫ్ ఇండియా” అనే సినిమా పోస్టర్ ను లాంచ్ చేసారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల రచయత డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని అర్ధమవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. గతకొంతకాలంగా సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులువేస్తున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో ఎస్వీర్ గా నటించి మెప్పించిన ఆయన ప్రస్తుతం తమిళ్ స్టార్ సూర్య నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో నటిస్తున్నారు.

Related posts