telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు…

Ganta srinivas tdp

విశాఖపట్నం ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో విశాఖపట్నం నార్త్ నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. స్పీకర్ కు తన రాజీనామా లేఖను పంపించానని అన్నారు. తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు చేస్తాను. ప్రైవేటు కాకుండా పోరాటం చేస్తాను అన్నారు. విశాఖపట్నం ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. విశాఖ పట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు రోడ్డెక్కారు. అన్ని పార్టీల నేతలు రోడ్డుమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉక్కుకర్మాగారం కోసం ఫైట్ చేయాలని ఆందోళనలు చేయడంతో విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts