తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా తార స్థాయికి చేరుకుంది. తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని… టీఆర్‌ఎస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్న హామీ ఏమైంది? డబుల్ బెడ్ రూం ఇళ్ల హా ఏమయింది? అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి. డబుల్ బెడ్ రూం ఇస్తారనే గతంలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటేశారని… ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ కట్టి ప్రజలకు ఇచ్చారా ? అని నిలదీశారు. రోడ్లపై గుంత చూపిస్తే… రూ. వెయ్యి ఇస్తామని గతంలో టీఆర్‌ఎస్ ఛాలెంజ్ చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు గుంతలేని రోడ్లు చూపిస్తే తాను రూ. లక్ష ఇస్తానన్నారు. హైదరాబాద్ సముద్రంగా మారడానికి ఈ ప్రభుత్వం కారణం కాదా? అని ప్రశ్నించారు. వరదల వల్ల దాదాపు 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ నిధులను దుబారాగా ఖర్చు చేసి అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. వేగంగా జరుగుతున్న మెట్రో పనులను అడ్డుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.
previous post
మునుగోడు ప్రచారానికి వెళ్లను..పిలవని పేరంటానికి వెళ్లాల్సిన అవసరం లేదు