బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. గత కొన్నిరోజుల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ పై కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత కంగనా రనౌత్ ఒక పక్క మొత్తం బాలీవుడ్ ఒక పక్క అన్నట్టు మారిపోయింది. ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న “తలైవీ” చిత్రం. లాక్ డౌన్ కారణముగా దాదాపు ఆరు నెలలు షూటింగ్ కు దూరమైన కంగనా ఇటీవలే షూటింగ్ స్పాట్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో జయలలితలా కనిపించేందుకు కంగన ఏకంగా 20 కేజీల బరువు పెరిగిందట. అంత బరువుతో భరతనాట్యం చేయడం వల్ల ఆమె వెన్ను భాగం దెబ్బతిందట. ఇది ఇలా ఉండగా… కంగనా ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ బిజీ షెడ్యూల్ వల్ల తన మేనల్లుడు పృథ్వీరాజ్‌ను చాలా మిస్ అవుతున్నట్టుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మేనల్లుడికి ముద్దిస్తున్న ఫోటోని షేర్ చేసిన కంగనా.. షూట్ కోసం బయలు దేరినప్పుడు అతను వెళ్లవద్దని అన్నాడని.. తప్పని పరిస్థితిల్లో వెళ్లాల్సి వస్తే రెండు నిమిషాలు నాతో కూర్చోని వెళ్లు అని చెప్పాడని తెలిపింది. ఇప్పటికీ అతని ముఖం గుర్తొస్తే.. తనకు కంట కన్నీరు కారుతుందని భావోద్వేగంతో పోస్ట్ పెట్టింది కంగనా.
previous post
పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” చెయ్యడం ఒక లైఫ్ చేంజింగ్… కానీ… : శృతి హాసన్