telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆమరణ దీక్షకు దిగనున్న జెసి బ్రదర్స్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రేపు ఆమరణ దీక్షకు దిగనున్నారు జెసి బ్రదర్స్‌. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ ఆందోళన బాట పట్టారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి తహసిల్దార్ కార్యాలయం ముందు ఆమరణ దీక్షకు కూర్చుంటా మంటున్నారు జెసి సోదరులు. అయితే.. వీరి దీక్షకు పోలీసులు అనుమతి లేదని స్పష్టం చేశారు. తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్, 30యాక్టు అమలులో ఉన్నందున ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు చేయకూడదని… ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 188 సెక్షన్ కింద కఠినచర్యలు తీసుకుంటామని డిఎస్పీ చైతన్య హెచ్చరించారు. రోడ్లపై షాపుల వద్ద గుంపులుగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ర్యాలీలు , ధర్నాలు చేయాలనుకుంటే పోలీసులు ముందస్తు అనుమతి తప్పనిసరి గా తీసుకోవాలని ఆదేశించారు. రేపు తాడిపత్రిలో జెసి బ్రదర్స్ దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసుల హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా.. గత కొన్ని రోజులుగా తాడిపత్రి ఎమ్మెల్యే, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ బ్రదర్స్‌ దీక్ష చేయడం రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేయనుంది.

Related posts