టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికలు జరగకుండా చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. ‘రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి పోయాడు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయించేందుకు కుట్రలు చేశారని దుయ్యబట్టారు.
ఓటమి భయంతో రెండేళ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా వేలాది కోట్ల నిధులు పోగొట్టాడు. ఇప్పుడు మార్చి 31లోగా స్థానిక ఎన్నికలు జరగకుండా కుట్ర పన్నాడు. ప్రజల్లోకి వెళ్లేందుకు మోహం చెల్లక చంద్రబాబు ఇలాంటి నికృష్టపు పనులకు దిగాడు’ అని విమర్శించారు.