telugu navyamedia
రాజకీయ

చిన్నారులకు క‌రోనా వ్యాక్సిన్‌..

క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో ఇండియా మ‌రో మైలురాయిని అందుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 18 ఏళ్లు నిండిన వారికి మాత్ర‌మే దేశంలో టీకాలు అందిస్తూ వస్తున్నారు. కాగా, చిన్నారుల‌కు సంబంధించి టీకాలపై భార‌త్ బ‌యోటెక్ సంస్థ ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హించింది. కోవాగ్జిన్ టీకాల ట్ర‌య‌ల్స్ పూర్తికావ‌డంతో డేటాను ఇప్ప‌టికే కేంద్రం ఆరోగ్య శాఖ‌కు అంద‌జేసింది.

కాగా కేంద్రం ఈ వ్యాక్సిన్‌కు అనుమ‌తులు మంజూరు చేసింది. సబ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్ ప్యానల్ అనుమ‌తులు ఇవ్వ‌డంతో మ‌రికొన్ని రోజుల్లోనే విప‌ణిలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది. డ్ర‌గ్స్ రెగ్యులేట‌రీ అనుమ‌తి ఇవ్వాల్సి ఉన్న‌ది. డ్ర‌గ్స్ రెగ్యులేట‌రీ అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే టీకాను పిల్ల‌ల‌కు అందిస్తారు. 2 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్ల‌ల‌కు టీకాను అందించేందుకు కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం.

Related posts