telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బోయపాటిని పరామర్శించిన అల్లు అర్జున్

Allu-Arjun

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనును స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. బోయపాటి శ్రీను తల్లి సీతారావమ్మ(80) గత శుక్రవారం కన్నుమూశారు. గురువారం (జనవరి 23న) ఉదయం గుంటూరు జిల్లా పెదకాకానిలోని బోయపాటి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. బోయపాటిని పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు బన్నీ ధైర్యం చెప్పారు. సీతారావమ్మ ఆత్మకు శాంతి కలగాలని అల్లు అర్జున్ అన్నారు. కాగా బోయపాటి-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘సరైనోడు’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.

Related posts