telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ వార్తలు

మరో క‌రోనా వ్యాక్సిన్ వినియోగానికి అనుమ‌తి ఇచ్చిన అమెరికా…

corona vacccine covid-19

ఈ నెలాఖరు వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆటాడుకుంది క‌రోనావైర‌స్.. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చాలా దేశాల ఆర్థిక ప‌రిస్థితి కూడా త‌ల‌కిందులు అయ్యింది.. ఇక‌, క‌రోనాకు చెక్ పెట్టేందుకు శాస్త్ర‌వేత్త‌లు చేసిన ప్ర‌యోగాలు విజ‌య‌వంతం అవుతున్నాయి.. క్ర‌మంగా ఒక్కో కోవిడ్ వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వ‌స్తుంది.. తాజాగా.. రెండో క‌రోనా వ్యాక్సిన్ వినియోగానికి కూడా అనుమ‌తి ఇచ్చింది అమెరికా ప్ర‌భుత్వం.. ఆ దేశంలో అత్య‌వ‌స‌ర వినియోగానికి మోడెర్నాటీకాకు అనుమ‌తి ఇచ్చింది డొనాల్డ్ ట్రంప్ స‌ర్కార్.. ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతం అయ్యాయ‌ని.. అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వాలంటూ మోడార్నా వ్యాక్సిన్ త‌యారీ సంస్థ పెట్టుకున్న ద‌ర‌ఖాస్తుకు స్పందించిన అమెరికా ఆహార‌, ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ.. అనుమ‌తి ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. దీంతో.. త్వ‌ర‌లోనే మోడార్నా టీకా వినియోగంలోకి రానుంది.. ఇక‌,  గ‌త వార‌మే ఫైజ‌ర్ టీకాకు ఆమోదం తెపింది అమెరికా ఎఫ్‌డీఏ.. దీంతో ఇప్ప‌టికే వ్యాక్సిన్ పంపిణీ కూడా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

Related posts