telugu navyamedia
సినిమా వార్తలు

సూపర్‌హిట్స్ ‘రెడ్ ఎఫ్.ఎమ్’ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా విశ్వక్ సేన్

సూపర్‌హిట్స్ 93.5 రెడ్‌ఎఫ్‌ఎం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఎంతో సంబరంగా జరుపుకుంది. “మేమే ఇండియన్స్” సీజన్ 7, భిన్నత్వంలో ఏకత్వమే ముఖ్య ఉద్దేశ్యంగా జరిపిన ఈ కార్యక్రమంలో కూచిపూడి, లంబాడీ, ఒగ్గు ధోల్, కథక్, ఒడిస్సి నృత్యాలు ప్రదర్శించారు. కొవిడ్ నిబంధనలతో… శరత్ సిటీ క్యాపిటల్ మాల్-కొండాపూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్ సేన్ పాల్గొన్నారు. రెడ్ ఎఫ్.ఎమ్ సరికొత్త జింగిల్ ను ఈ సందర్భంగా విశ్వక్ లాంచ్ చేసి.. రెడ్ ఎఫ్.ఎమ్ బృందాన్ని అభినందించారు. విశ్వక్‌ సేన్‌ తాజాగా నటించిన చిత్రం పాగల్‌. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Related posts