telugu navyamedia
సినిమా వార్తలు

హీరో రామ్‌ మెడకు గాయం !

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్‌ పోతినేని గాయాలయ్యాయి. రామ్ పోతినేని జిమ్ చేస్తుండ‌గా.. అత‌ని మెడ‌కు బాగా గాయ‌మైన‌ట్లు సమాచారం. ప్ర‌స్తుతం రామ్ హీరోగా తమిళ డైరెక్టర్  లింగుస్వామి డైరెక్షన్‌లో  రాపో19′  పాన్‌ ఇండియా సినిమాలో న‌టిస్తున్నారు.

ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ కోసం ఎక్సర్ సైజులు చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌ మెడ‌కు గాయ‌మైంది. రామ్‌కు గాయం కావ‌డంతో  రాపో19′ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాను రామ్ అభిమానులు ‘రాపో19’ గా పిలుస్తున్నారు.

Rapo 19: Rock Star On The Field For Hero Ram .. Energetic Star Who Surprised Fans

అయితే తనకు గాయమైన విషయాన్ని తెలియ‌జేస్తూ రామ్ త‌న‌ నెక్ బ్యాండ్‌తో ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. త‌మ అభిమానులకు ఆందోళ‌న చెంద‌వ‌ద్దు , రెట్టింపు ఉత్సాహంతో తిరిగి మీ ముందుకు వ‌స్తానంటూ రామ్ ట్వీట్‌ చేశారు. దీంతో ‘రామ్‌ త్వరగా కోలుకోవాలి..గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

‘రాపో 19’ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయకిగా నటిస్తోంది. ఇందులో రామ్ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటల్లో రెండు ట్యూన్స్ ఇప్పటికే ఫైనల్ అయ్యాయి.

Image

Related posts