telugu navyamedia
సినిమా వార్తలు

ఇక దుమ్ము దుల‌పాల్సిందే..!

ఇన్నిరోజులుగా వస్తున్న విడాకుల రూమర్లను నిజం చేస్తూ సమంత, నాగ చైతన్య అధికారిక ప్రకటన చేసేశారు. అక్టోబర్ 2వ తేదీన తమ వివాహ బంధానికి సమంతా, నాగచైతన్య ముగింపు పలికారు. తామిద్దరం ఇక భార్యభర్తలుగా ఉండబోవడం లేదని, కానీ స్నేహితుల్లా ఎప్పటికీ కలిసే ఉంటామని పేర్కొంటూ ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.

Samantha's first post after divorce is about changing herself, see here | News24

దీంతో ఎక్కడ చూసిన సామ్, చైల‌ విడాకుల మ్యాటరే. ట్రెండింగ్ వార్తలన్నీ వీళ్ళ గురించే.. వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. అసలు వారిద్దరూ విడిపోవడానికి దారి తీసిన కారణాలు ఏంటన్న దానిపై వారి సోషల్‌ మీడియా అకౌంట్లపై ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు.

Samantha Akkineni's has got the coolest response to fan asking her to divorce Naga Chaitanya!

తాజాగా విడాకుల అనంతరం సమంత తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది..‘ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే, ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు. బద్దకం వదిలి ముందుకు నడవాలి’ ..అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చొంది. దీంతో సోష‌ల్ మీడియాల్లో వైరల్‌గా మారిన‌ సమంత పోస్ట్ కి బెస్ట్ విషెష్ చెప్తున్నారు కొంద‌రు నెటిజన్స్.

Related posts