telugu navyamedia
సినిమా వార్తలు

జైలు నుంచి విడుదలైన ఆర్యన్‌ ఖాన్‌..

బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారుక్​ ఖాన్ తనయుడు ఆర్యన్​ఖాన్ జైలు నుంచి ఎట్ట‌కేల‌కు విడుదలయ్యాడు.ఆర్యన్‌తోపాటు అరెస్ట్ అయిన అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేజాలకూ కోర్టు బెయిల్ ఇచ్చింది. 

షారుఖ్ తన కుమారుడిని జైలు నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి జైలుకు చేరుకున్నాడు. ఆర్యన్ బయటకు రాగానే అతన్ని బాడీగార్డ్ వెంటనే కారులోకి పంపాడు. 23రోజుల జైలు జీవితం అనంతరం ఆర్యన్‌ బయటకు వచ్చారు. దీంతో అయితే ఆర్ధర్ రోడ్​ జైలు వద్దకు షారుక్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ‘వెల్‌కం ఆర్యన్‌’ అంటూ పోస్టర్లు పట్టుకొని బాణసంచా కాల్చుతూ ఫ్యాన్స్‌ సంబరాల్లో మునిగిపోయారు.

Aryan Khan released from Arthur Road jail - The Hindu

అక్టోబరు 2న ముంబ‌చ‌యి క్రూయిజ్​షిప్​లో రేవ్​పార్టీ, డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్​ఖాన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి దాదాపు 22రోజులు జైలులోనే ఉన్నాడు. అతడి తరఫు న్యాయవాదులు పలుమార్లు ప్రయత్నించినప్పుటికీ, కోర్టు దానిని మంజూరు చేయలేదు. ఎట్టకేలకు గురువారం(అక్టోబరు 28) ఆర్యన్​కు బెయిల్​ మంజూరు చేసింది.

కానీ..అతని విడుదలకు సంబంధించిన  పత్రాలు అందడం ఆలస్యం కావడం వల్ల శనివారం ఉదయం జైలు నుంచి విడుదల చేశారు. ఆర్యన్​కు వ్యక్తిగత పూచీకత్తును సీనియర్ నటి జుహీచావ్లా ఇచ్చారు. ఆర్యన్ ఖాన్ డబ్బు చెల్లించడంలో విఫలమైతే ఆమె చట్టపరంగా బాధ్యత వహిస్తుందని దీని అర్థం.

BREAKING: Aryan Khan released from Arthur Road Jail weeks after his arrest  in drugs case - First VIDEO, PICS | People News | Zee News

అయితే హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి లక్ష రూపాయల బాండ్ చెల్లింపుతో సహా 14 షరతులు విధించింది.దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్‌ హాజరుకావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్యన్‌ దేశం వదిలి వెళ్లకూడదని కూడా బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

Related posts