నటరత్న ఎన్. టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం రఘురామ్ పిక్చర్స్ వారి “కలవారి కోడలు”
14-03-1964 విడుదలయ్యింది.
నిర్మాత, దర్శకుడు కె. హేమాంబరధరరావు గారు రఘురామ్ పిక్చర్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ,మాటలు: నార్ల చిరంజీవి, పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు, ఆరుద్ర, నార్ల చిరంజీవి, సంగీతం: తాతినేని చలపతిరావు, ఫోటోగ్రఫీ: ఎం.జి.సింగ్, కళ: బి.ఎన్.కృష్ణ, నృత్యం: వెంపటి సత్యం, ఎడిటింగ్: బి.గోపాలరావు, అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి,గిరిజ, ప్రభాకరరెడ్డి, రమణారెడ్డి, పద్మనాభం, గీతాంజలి, చలం, సూర్యకాంతం, హేమలత తదితరులు నటించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు టి.చలపతిరావు గారి సంగీత సారధ్యంలో
“దొంగచూపులు చూచి దోరవయసు దోచి”
“భలేగా నవ్వితివి ఎలాగో చూచితివి”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రం యావరేజ్ గా నడిచి కొన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడి అర్థశతదినోత్సవాలు జరుపుకున్నది.
విజయవాడ – శ్రీరామా టాకీస్ లో 52 రోజులు ప్రదర్శింపబడింది..
కోలీవుడ్ స్టార్ హీరో అమ్మాయిని ర్యాగింగ్ చేశారు… పృథ్వీ షాకింగ్ కామెంట్స్