5 ఏళ్ల వయసులోనే తమన్నా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రంలో నటించింది. అదే ఏడాది తెలుగులో శ్రీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రం తెలుగులో తమన్నాకు మంచి బ్రేక్ అందించింది. అప్పటినుండి మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపుగా టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది. ఇది ఇలా ఉండగా.. టాలీవుడ్‌లో మరో బయోపిక్ తెర రూపం దాల్చనున్నట్లు సమాచారం. సీనియర్ నటి జమున జీవితం ఆధారంగా సినిమా రానున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో జమునగా మిల్కీబ్యూటీ తమన్నా.. నటించనుందని తెలుస్తోంది. దేవినేని ఫేం శివనాగు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టు వర్క్ పూర్తయిందని, జమున అనుమతి రాగానే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.